- 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యేబూషి ఆర్యన్ కౌశిక్
- రాజకీయాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేస్తా..
- విద్యావంతుడినైన నన్ను ఆశీర్వదించి.. గెలిపించండి :వార్డు ప్రజలను కోరిన ఆర్యన్
వేద న్యూస్, జమ్మి కుంట:
రాబోయే మున్సిపల్ ఎన్నికలలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యేబూషి ఆర్యన్ కౌశిక్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయ నేపథ్యం కలిగిన తన కి అవకాశం ఇస్తే.. నిస్వార్ధంగా సేవ చేస్తూ.. వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. స్వార్థం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని నిస్వార్ధంగా నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో ఉంటున్నట్టు వెల్లడించారు.
మెరుగైన సమాజం కోసం కృషి
మెరుగైన సమాజం ఏర్పాడాలంటే సమస్యలపై అవగాహనతో పాటు ప్రజల మన్ననలు పొందాలని కుటిల రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవే లక్ష్యంగా పనిచేయాలని మీ ముందుకు వస్తున్నానని మీ బిడ్డకు మీ ఆశీర్వాదం అందించి ఆచరిస్తే గెలిచి మీకు అండగా ఉంటానని ఏడవ వార్డు ప్రజలకు కౌశిక్ పేర్కొన్నారు.
7వవార్డులో పుట్టి పెరిగిన కుటుంబంలో ఉన్నానని, ఇక్కడి స్థితిగతులపై తనకి పూర్తి అవగాహన ఉందని.. పార్టీలకు అతీతంగా తన ను ఆశీర్వదించి గెలిపిస్తే… సేవకుడి గా పని చేస్తానని స్పష్టం చేశారు.
అభివృద్ధి విషయంలో రాజీపడకుండా సమస్యల పరిష్కారంలో ముందుంటానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కౌశిక్ అభ్యర్థించారు.