•  షాపింగ్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచిని వెంట తీసుకెళ్దాం.!
  • మాంసాహారం తేవడం కోసం స్టీల్ డబ్బాలను ఉపయోగిద్దాం.!
  • ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడుకుందాం.!
  • పర్యావరణ రక్షణే మన ధ్యేయం.! లేదంటే భవిష్యత్తు శూన్యం.!
  • మార్పు మననుండే, మన ఇంటి నుండే మొదలవ్వాలి.!

 

ప్లాస్టిక్ రహిత పర్యావరణం: మన కర్తవ్యం – జీవకోటి సౌభాగ్యం:

నేటి ఆధునిక జీవనశైలిలో ‘ప్లాస్టిక్’ ఒక విడదీయలేని భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు మనం వాడే వస్తువులలో ప్లాస్టిక్ ఆధిపత్యమే కనిపిస్తోంది. కూరగాయలు, కిరాణా సరుకులు, పాలు, మాంసం.. ఇలా ఏది కొనాలన్నా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తప్పనిసరి అనే స్థాయికి మనం చేరుకున్నాం. అయితే, ఈ సౌకర్యం వెనుక భయంకరమైన పర్యావరణ విధ్వంసం దాగి ఉందనే నిజాన్ని మనం విస్మరిస్తున్నాం. ప్రతిరోజు మన నిత్య జీవితాల్లో మనము నిత్యావసరాల కోసం, త్రాగు ద్రవాలకోసం, తినే ఆహరం కోసం, సరుకుల కోసం, కూరగాయల కోసం, మాంసాహారం (మటన్, చికెన్ చేపలు మొ.) సూపర్ మార్కెట్ల నుంచి, షాపింగ్ మల్స్ నుండి, బజార్ల లోని వివిధ షాపులనుండి, అంగళ్ళ నుండి, మెడికల్ షాప్స్ మొదలగు వాటి నుంచి తిను బండారాలను, సరుకులను, వస్తువులను తీసుకురావడానికి ఉపయోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగును ఇస్తే తెచ్చుకుంటున్నాం. ఈ విధమైన అలవాటు ఎక్కువ శాతం అలవాటుగా మారిపోయింది. ఇలా వాడడం వలన భూమి, పర్యావరణ సమతుల్యానికి మరియు మానవులతో పాటుగా ఇతర జీవ మనుగడకు ప్లాస్టిక్ కాలుష్యం వలన అనారోగ్యం, ఎన్నో ఇతర అనర్ధాలు ఏర్పడి నష్టము వాటిల్లుతున్నది. ఈ ప్లాస్టిక్ కాలుష్య భూతం భూమిలో, నీటిలోన, గాలిలోన కలిసి సూక్మ ప్లాస్టిక్ వ్యర్థలుగా తినే ఆహారం ద్వారా, త్రాగే నీటిద్వారా, పీల్చే గాలిద్వారా జీవులకు ఎన్నో తత్కాలిక, దీర్ఘ కాలిక రోగాలను కాన్సర్లు రావడానికి కారణభూతమవుతున్నాయి.

 

ఆరోగ్యంపై ప్లాస్టిక్ ప్రభావం (మైక్రో ప్లాస్టిక్ ముప్పు): ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో అది ‘మైక్రో ప్లాస్టిక్’ (సూక్ష్మ ప్లాస్టిక్) కణాలుగా విడిపోతుంది.

ఆహార గొలుసులో ప్లాస్టిక్: మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా ఈ కణాలు మన శరీరంలోకి చేరుతున్నాయి.

వ్యాధుల కారకం: ప్లాస్టిక్‌లోని కెమికల్స్ వల్ల క్యాన్సర్, హృద్రోగాలు, హార్మోన్ల అసమతుల్యత మరియు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. కేవలం మనుషులకే కాకుండా, మూగ జీవాలు ప్లాస్టిక్ సంచులను ఆహారంగా భ్రమించి ప్రాణాలు కోల్పోతున్నాయి.

 

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి: నిజానికి సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వాడకం పెరుగుతోంది, ఇండియాలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఒక్కోరినుండి అనగా ఆవరేజీగా ఫర్ క్యాపిటా ఆధారంగా గణనీయమైన తేడాలు ఉన్నాయి. ఇటీవలి డేటా ప్రకారం వివరాలు పరిశీలన చేసినట్లయితే… ప్రపంచ ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రపంచంలో 2023లో మొత్తం ప్లాస్టిక్ ఉత్పత్తి 413.8 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2026 ప్రపంచ జనాభా సుమారు 8.27 బిలియన్లు అయితే పెర్ క్యాపిటా సుమారు 50 కేజీలు. ఓ.ఇ.సీ.డి. (ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్), దేశాలు అంటే ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థలో సభ్య దేశాలు. ప్రస్తుతం ఇందులో అమెరికా, యూకే, జపాన్, జర్మనీ మరియు కొరియా వంటి 38 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అలాగే చిలీ, కొలంబియా, కోస్టారికా మరియు ఇజ్రాయెల్ వంటి కొత్త సభ్య దేశాలు ఉన్నాయి. వీటి అంచనాల ప్రకారం 2019లో ప్లాస్టిక్ వాడకం 460 మిలియన్ టన్నులు, ఫర్ క్యాపిటా ఓ.ఇ.సీ.డి. దేశాల్లో 238 కేజీలు, ఇతర దేశాల్లో 77 కేజీలు ఉత్పత్తి అవుతుందని నివేదికల అంచనాలు చెపుతున్నాయి.

 

భారతదేశ ప్లాస్టిక్ ఉత్పత్తి:

భారతదేశంలో 2021లో వాడకం 21 మిలియన్ టన్నులు, జనాభా 1.47 బిలియన్లు అయితే పెర్ క్యాపిటా సుమారు 14-15 కేజీలు. 2024లో కొన్ని అంచనాలు 11 కేజీలు చెబుతున్నాయి, కానీ రోజు రోజుకు ఊహకందనిరీతిలో ఈ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. జనాభా విస్పోఠనం కారణం కావొచ్చు,

శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కావొచ్చు, పాశ్చాత్య అలవాటు దోరణాలు ఈ ప్లాస్టిక్ వాడుకకు కారణం కావొచ్చు. 

 

ప్రపంచ ప్లాస్టిక్ ఉత్పత్తిలో దేశాల పోలిక:

ప్రపంచ వ్యాప్తంగా 2023 సంవత్సరం ప్లాస్టిక్ వాడుకం పోలిక చూస్తే ~50 ఫర్ క్యాపిటా (కేజీ/సంవత్సరం). అదేవిధంగా 2019 సంవత్సరం ప్లాస్టిక్ వాడుకం పోలిక చూస్తే ఓ.ఇ.సీ.డి. (ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) 238 ఫర్ క్యాపిటా (కేజీ/సంవత్సరం). ఐతే ఇటీవల 2021-24 సంవత్సరాలకు గాను ఇందులో ఒక అమెరికా యొక్క ప్లాస్టిక్ ఉత్పత్తే 130 ఫర్ క్యాపిటా (కేజీ/సంవత్సరం) భాగస్వామ్యం ఉత్పత్తి చేయగా, భారతదేశం మాత్రం 11-15 ఫర్ క్యాపిటా (కేజీ/సంవత్సరం) ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తున్నదని ఘనంఖాలు శాస్త్రియంగా చూపుతున్నాయి. ఈ ఉత్పత్తిని తగ్గించుకోవాలంటే ప్లాస్టిక్ వాడకం స్థానంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత సంప్రదాయ రవాణా సంచులను (క్యారీ బాగ్స్) వస్తువులను, తొందరగా భూమిలో కుళ్ళిపోయి సేంద్రియ పదార్ధంగా మారిపోయే సాంప్రదాయ ఉత్పతపత్తులను తయారు చేసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి.

 

ప్లాస్టిక్ వాడుక స్థానంలో ప్రత్యామ్నాయం:

ప్లాస్టిక్ వాడుక వాటి స్థానంలో దైనందిన జీవన అవసరాలకు ఉపయోగిస్తున్న ఆహర, పానీయ పదార్ధాలు, సరుకులు తీసుకురావడానికి ప్లాస్టిక్ సంచులను నూశేడించే దిశగా వాటి గోనె సంచులు (గన్ని బ్యాగ్స్), బట్ట లేదా గుడ్డ (క్లాత్) సంచులు, టిఫిన్ డబ్బాలు, తిరిగి ఎన్నోసార్లు ఉపయోగించే సంచులు, కాగితపు సంచులు (పేపర్ బ్యాగ్స్), నీళ్లు త్రాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా స్టీల్ బాటిల్స్ ని ఉపయోగించేలా ఆచరిస్తే బాగుంటుంది.

ప్రత్యామ్నాయ మార్గాలు – మన పరిష్కారాలతో ప్లాస్టిక్‌ను తరిమివేయడం అసాధ్యమేమీ కాదు. మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ పద్ధతులే ఇందుకు సరైన మార్గం.

వస్త్ర మరియు జూట్ సంచులు:

షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంట్లోనే బట్ట సంచిని సిద్ధం చేసుకోవాలి. గోనె సంచులు, జూట్ బ్యాగులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.

స్టీల్ డబ్బాల వాడకం:

మాంసం, చికెన్, చేపలు వంటివి తేవడానికి ప్లాస్టిక్ కవర్లకు బదులు స్టీల్ క్యారియర్లు లేదా డబ్బాలను ఉపయోగించాలి. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడాలి.

బయో-డీగ్రేడబుల్ వస్తువులు:ప్రస్తుతం మార్కెట్లో కార్న్ స్టార్చ్, చెరకు పిప్పి (భగస్సే), మరియు వెదురుతో చేసిన సంచులు, ప్లేట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 90 నుండి 180 రోజుల్లో భూమిలో కలిసిపోయి ఎరువుగా మారుతాయి.

రోగాలు కలిగించకుండా, సహజంగా భూమిలో కలిసిపోయే బయో-డీగ్రేడబుల్ మెటీరియల్స్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌లు, సరుకులు అందుబాటులో ఉన్నాయి. ఇవి పర్యావరణానికి స్నేహపూర్వకంగా పనిచేస్తాయి. భారతదేశంలో ఈ వస్తువులు సులభంగా లభిస్తాయి. 

 

*ప్రధాన ప్రత్యామ్నాయ కాగితం బ్యాగ్ మెటీరియల్స్ (పేపర్ బ్యాగ్స్):* బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్‌లు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలుగా పర్యావరణానికి స్నేహపూర్వకమైనవి, భూమిలో 90 రోజుల నుంచి 6 నెలల్లో కలిసిపోతాయి. ఇవి కార్న్ స్టార్చ్, బ్యాగాస్ వంటి సహజ మెటీరియల్స్‌తో తయారవుతాయి. చెట్ల నుంచి తయారవుతాయి, 2-6 నెలల్లో కలిసిపోతాయి. రీసైకిల్ చేయొచ్చు, రోగాలు కలిగించవు. జూట్/కాటన్ (క్లాత్ బ్యాగ్స్):సహజ ఫైబర్స్, శాశ్వతంగా ఉపయోగించొచ్చు, భూమిలో 1-5 సంవత్సరాల్లో పాడవుతాయి. బ్యాగాస్ (సుగర్ కాన్ బ్యాగ్స్): పొలాల నుంచి వస్తుంది, 90 రోజుల్లో డీకంపోజ్ అవుతుంది, టాక్సిన్‌లు లేవు.

ఇతర డీగ్రేడబుల్ సరుకులుకార్న్ స్టార్చ్ ప్లాస్టిక్: పి.ఎల్.ఏ. మెటీరియల్, కంపోస్ట్‌లో 6 నెలల్లో కలుస్తుంది. బ్యాగ్స్, ప్యాకేజింగ్‌కు ఉపయోగం. *మట్టి/లీఫ్ ప్లేట్స్:* ఆకలు, మట్టి నుంచి, రోజుల్లోనే కలిసిపోతాయి. డిస్పోజబుల్ ఉపయోగాలకు బాగా వర్కవుతాయి.

బాంబూ ఫైబర్ బ్యాగ్స్:

బీటీ పెరుగుతుంది, 3-6 నెలల్లో డీగ్రేడ్ అవుతుంది. *భారతదేశంలో లభ్యత:* హైదరాబాద్, ఢిల్లీలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో, ఇండియామార్ట్‌లో సులభంగా లభిస్తాయి.

 

జూట్ బ్యాగ్స్ ₹20-100 ధరకు, బ్యాగాస్ బ్యాగ్స్ ₹5-15కు దొరుకుతాయి. *ప్రధాన బ్రాండ్స్ మరియు రకాలు:* డా. బయో రియూసాబుల్ బాగ్స్: కంపోస్టబుల్, 16×20 ఇంచెస్, ప్యాక్ ఆఫ్ 30 ₹250-520, ఇవి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చే సర్టిఫైడ్ చేయబడినవి సాకర్ బయాకంపోస్టేబుల్: 250gm నుంచి 10కేజీ క్యాపాసిటీ, డబ్ల్యూ-కట్ హ్యాండిల్, వైట్/ట్రాన్స్‌పరెంట్, తక్కువలో తక్కువ ఆర్డర్ 500కేజీ. పాలిమర్ ప్యూర్ ఎర్త్: 1కేజీ గ్రాసరీ బ్యాగ్స్, బయో ప్లాస్టిక్, 180 డేస్ షెల్ఫ్ లైఫ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు/సి.ఐ.పి.ఇ.టీ సర్టిఫైడ్ చేయబడినవి.

 

ప్లాస్టిక్ వినియోగం దుష్పరినామాలపై అవగాహణ: అవగాహనా నిమిత్తం స్థానిక NGOలు, సెలబ్రిటీలు, టీవీ ఛానెల్లు, సోషల్ మీడియా వీటిని గ్రీన్ స్టోర్స్‌లో సహజ డీగ్రేడబుల్ ప్రొడక్ట్స్ గా ప్రమోట్ చేయాలి. హైదరాబాద్‌లో స్థానిక సప్లయర్లు లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు.

రీసైకిల్ చేస్తూ వాడటం మంచిది. పర్యావరణ హితం గోరే స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ ప్రేమికులు పర్యావరణవేత్తలు సూచిస్తున్నటువంటి మరియు ప్రభుత్వము ప్రత్యేకంగా నిర్దేశించిన కాలుష్య రహిత సంచులు, మాంసము, చికెను, చేపలు మొదలగు నవి (నాన్ వెజ్) తేవడానికి స్టీలు డబ్బాలను ఉపయోగించుకోవాలి.

తద్వారా ప్లాస్టిక్ పొల్యూషన్ను మరియు ఘన వ్యర్ధాలు (సాలిడ్ వేస్ట్) కాలుష్యాన్ని (పొల్యూషన్) కంట్రోల్ చేయవచ్చు, చేయగలం కూడా. మనకు మనచుట్టూ ఉన్న ప్రకృతి, పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. మనతోపాటు అన్ని జీవులు స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవిస్తూ ఉంటాయి.

ప్లాస్టిక్ మరియు ఘన వ్యర్థాలను కంట్రోల్ చేయడంలో మన వంతు బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. ఘన వ్యర్థాలను తక్కువ చేసి పర్యావరణ సమతుల్యతలో, గాలి, నీరు, మరియు భూమి (పర్యావరణ) కాలుష్యం (పొల్యూషన్) నుంచి ప్రకృతిని కాపాడిన వాళ్ళము అవుతాము.

 

ప్లాస్టిక్ వాడకం నిషేధం సామూహిక బాధ్యత:

నేను ప్లాస్టిక్ వాడను. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వాడితే తిరిగి మళ్ళీ వాడుకునే బహుళ ఉపయోగార్ధ వస్తువులనే వాడుతాను” అనే ఆలోచనా మనలో రావాలి. ఆ ప్రయత్నం ఒకటే దీనికి మార్గం. గట్టిగా మనసులో అనుకొని, ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా పాటిస్తే సరిపోతుంది. లేదంటే మనము అనేక క్యాన్సర్, హుద్రోగ, శ్వాసకోశ రోగాలకు గురై అనారోగ్యం పాలు కావడమే కాకుండా మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యకర వాతావరణంతో కూడిన పర్యావరణాన్ని రాబోయే తరాలకు అదేవిధంగా ఇవ్వలేము.

వాళ్ల భవిష్యత్తును మనమే కాల రాసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సామూహికంగా అందరం ఒక భాద్యతగా ఈ మహమ్మారిని తరిమి వేసే అవసరం మనపైన ఎంతో ఉన్నది.

 

ప్లాస్టిక్ వాడకం – పర్యావరణ సమతుల్యతకు విఘాతం: భూమి, నీరు, గాలి.. ఇలా పంచభూతాలూ ప్లాస్టిక్ కాలుష్యంతో నిండిపోయాయి. సముద్ర గర్భంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వల్ల జలచరాలు అంతరించిపోతున్నాయి. భూమిలో ప్లాస్టిక్ పొరలు ఏర్పడటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకక భూగర్భ జల మట్టం పడిపోతోంది.

ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి రాబోయే తరాలకు ఎడారి లాంటి భూమిని మిగిల్చే ప్రమాదం ఉంది. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమివేయాలనే ఆలోచనతో ఉమ్మడిగా అందరం కలిసి ఆలోచించాలి. దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు సరుకుల తేవడానికి ఉపయోగించే, వాడే ప్లాస్టిక్ సంచుల స్థానంలో పర్యావరణహిత సంచులను, స్టీలు గిన్నెలను, స్టీలు డబ్బాలను, స్టీలు పాత్రలను, గాజు పాత్రలను మాత్రమే ఉపయోగించుదాం. ప్లాస్టిక్ ను రెడ్యూస్, రీయూస్ మరియు రీసైకిల్ అను “3ఆర్”సూత్రాన్ని, తడిచెత్త, పొడిచేత్త వేరుచేసి మునిసిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ యొక్క ఆదేషిక సూత్రాలను, నిబంధనలను పాటిస్తూ పర్యావరణ రక్షణే మన ధ్యేయంగా మెదులుకునేలా మనము అందరం కలిసి ఉమ్మడిగా పాటించాలి. ఇది మన ప్రాథమిక విధి (కర్తవ్యం) గా నిర్వర్థించలి.

 

మన ప్రాథమిక విధి – రాజ్యాంగ బాధ్యత:

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని సంరక్షించడం మరియు మెరుగుపరచడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఈ బాధ్యతను గుర్తించి “నేను ప్లాస్టిక్ వాడను – ఒకవేళ వాడినా అది పర్యావరణానికి హాని చేయని రీతిలో ఉండేలా చూసుకుంటాను” అనే సంకల్పం మనలో కలగాలి. అవిధంగా భావిద్దాం, ఆచరిద్దాం, సంతోషంగా జీవిద్దాం. అప్పుడే ఈ భూ, జల, వాయు వాతావరణాలు కాలుష్యం నుండి విముక్తి పొంది భౌమ్యావరణ క్షేత్రం సుభిక్ష్యంగా విలసిళ్ళుతుంది. మార్పుదిషవైపు ఆలోచిద్దాం, ఆచరిద్దాం, ఆరోగ్యంగా అన్నీ జీవులతో కలిసి ఆనందంగా జీవిద్దాం. మార్పు మన నుండే మొదలవ్వాలి.

స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు మరియు ప్రభుత్వం చేసే ప్రచారం కంటే, ప్రతి ఒక్కరిలో వచ్చే అంతర్గత మార్పు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిస్తుంది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని, సారవంతమైన భూమిని అందించడం మనందరి నైతిక బాధ్యత.

 

ప్లాస్టిక్ రహిత సమాజం – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం

 

రవిబాబు పిట్టల, ఎం.ఎస్సీ., ఎం.టెక్., (పీహెచ్డీ), పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, జే.ఎన్.టీ.యు.హెచ్., హైదరాబాద్, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జీ.ఓ., తెలంగాణ.