వేదన్యూస్ తెలంగాణ
ఎల్లుండి నుంచి మూడ్రోజుల పాటు బీజేపీ నిరసనలు
తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు బీజేపీ పోరుబాట చేపట్టనుంది. ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. తొలి రోజు తాండూరులో రైతులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రెండో రోజు గజ్వేల్, భువనగిరి, వరంగల్, మూడో రోజు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పోరుబాట సాగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలో పాల్గొంటారు.