వేద న్యూస్, హుజూరాబాద్:
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలోని శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు శుక్రవారం నిర్వహించారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన అమ్మవారి ఫోటోతో పాటుగా విద్యార్థినులు బోనాలు తలపై పెట్టుకుని నృత్యాలు చేశారు.
విద్యార్థుల పోతరాజు విన్యాసాలు, విద్యార్థుల ప్రత్యేక వేషధారణతో పాఠశాల సందడిగా మారింది.ఈ
సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లింగా రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులకు పండగలు,మన ఆచార సంప్రదాయాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు,తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

