*పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం*

*సర్పంచ్ పావని నరేందర్ గౌడ్*

వేద న్యూస్, పాపన్నపేట

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఆమె దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు దుర్గయ్య, స్థానిక నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *