వేద న్యూస్, పాపన్నపేట

ఓ మగ శిశువును వదిలివెళ్లిన సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…పోడ్చన్ పల్లి తాండా వద్ద ఇళ్ల వెనక గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును శనివారం ఉదయం వదిలి వెళ్లగా తండా వాసులు గమనించి పోలీసులకు, ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ అధికారులకు సమాచారం అందించగా పోలీసులు, ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని శివువును అక్కడి నుంచి మెదక్ లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.అక్కడి నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *