వేదన్యూస్ పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్లో నెలకు రూ.2,500 సంపాదించే ఓ పనిమనిషి ఎమ్మెల్యే అయ్యారు. కలితా మారీ (37) అనే మహిళ ఆస్ట్రమ్ (SC) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి TMC అభ్యర్థిపై 12వేల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1,07,692 ఓట్లు సాధించారు. కలిత గత రెండు దశాబ్దాలుగా 3-4 ఇళ్లలో పాత్రలు కడగడం, వంట పనులు లాంటివి చేస్తున్నారు. MLA అభ్యర్థిగా ప్రకటించినా ఆ పనులు చేసుకుంటూనే ప్రచారం చేసి గెలుపొందడం విశేషం.