వేద న్యూస్, కరీంనగర్:
ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో “ఆడపిల్లలను ఎగురనిద్దాం- ఎదుగనిద్దాం” అనే కార్యక్రమాన్ని కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఆడపిల్లలు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలనే గొప్ప ఆలోచనతో సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేయడం అభినందనీయం అని చెప్పారు . ఆడ పిల్లలు వీటిని ఉపయోగించుకొని క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, కార్యదర్శి. శ్రీ . రమేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలను ప్రోత్సహించేలా ఏర్పాటుచేసిన ఇటువంటి కార్యక్రమం క్రీడల్లో రాణించాలని అనుకునే ఆడపిల్లలకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని, భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వారు ఇటువంటి బృహత్తర కార్యక్రమం మా పాఠశాలల్లో చేయడం అభినందనీయం అని వెల్లడించారు.
భవిష్యత్ లో వారి సహాయ సహకారాలు మరింతగా అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ బాధ్యులు లైశెట్టి హరికృష్ణ, సాయిచందర్, సంజయ్, డా. అనిల్ మేర్జ, లక్ష్మణ్, నరేష్, అఖిల్, అభినేష్ , అనిల్ , నవీన్, శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..
