– డిఎస్పీ నాగేంద్రచారి
వేద న్యూస్,ఇల్లంతకుంట:
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో రూరల్ సిఐ మొగిలి, ఎస్ఐ లు అశోక్, ఉపేంద్ర చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.