వేదన్యూస్ తమిళనాడు : 

తమిళనాడులోని తిరుప్పత్తూరులో టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతికి అదృష్టం వరించింది. కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచి MLA అయ్యారు. ఆయనకు 83,375 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ 83,374 ఓట్లు సాధించి గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఇక బీజేపీ అభ్యర్థి తిరుమారన్ 29,054 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.