వేదన్యూస్

దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది.

నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-కేవైసీ అప్డేట్ చేయడానికి జూన్ 30ను చివరి తేదీగా నిర్ణయించారు. వినియోగదారులు గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, వారి గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారా ఇంటి నుంచే కేవలం 5 నిమిషాల్లో ఇ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *