వేదన్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరం కరీమాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ నామాల రాజు కుమారుడు లోకేశ్ పాలిసెట్ ఫలితాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో లోకేశ్ ఎలాంటి కోచింగ్ లేకుండానే ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పదో తరగతి పరీక్షల్లోనూ 568 మార్కులతో ప్రతిభ చాటిన లోకేశ్, పాలిసెట్ ఎంబైపీసీ విభాగంలోనూ రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించడం విశేషం.