• కొండాయిలపల్లిలో విషాదం
  • చికిత్స పొందుతూ నరేష్ కన్నుమూత

వేద న్యూస్, నల్లబెల్లి :
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త ఊరటి నరేష్ (46) గుండెపోటుకు గురై మృతిచెందిన విషాద ఘటన కొండాయిలుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఊరటి నరేష్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చిందనే సమాచారం అందడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదే సమయంలో ఆయనకు కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ నరేష్ పరిస్థితి విషమించి మృతిచెందారు.
నరేష్ మృతితో కొండాయిలుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. నరేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయన వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయన అకాల మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు నరేష్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *