సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.అయితే, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సెషన్ మొత్తానికి ఆమె దూరంగా ఉండే అవకాశముందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
దీనిపై ఇప్పటివరకు కొండా సురేఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.మంత్రి పదవి నుంచి తప్పించిన అనంతరం ఆమె తొలి అసెంబ్లీ సమావేశానికి గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆమె తదుపరి అడుగులపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
