- త్వరలో వివిధ గ్రామాల్లో క్యాంపులు
- ఫ్రీ గా: ఆదిత్య ఆసుపత్రి ఎండీ దేవేందర్ రెడ్డి
- హిమ్మత్ నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
వేద న్యూస్, జమ్మికుంట:
వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం జమ్మికుంట ఆదిత్య, అమృత హాస్పిటల్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ భరత్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ గ్రీష్మ (గైనకాలజిస్ట్) పాల్గొని గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా పూర్తిగా ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన గ్రామ సర్పంచ్ జడల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మేక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలకు ఆదిత్య మరియు అమృత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను ప్రజలకు అందించడంలో ఆదిత్య, అమృత హాస్పిటల్ యాజమాన్యం ముందుంటుందని పేర్కొన్నారు.

