•  ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం
     సాయం చేయాలని దాతలకు వేడుకోలు

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన స్వామి అలియాస్ శ్యామ్(31) రోడ్డు ప్రమాదానికి గురి కాగా, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ కుటుంబం పరిస్థితి విషాదంలోకి చేరింది.

ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన సదరు కుటుంబం రోడ్డున పడినది.మృతుడికి 5 ఏండ్ల లోపు ఉన్న చిన్న పిల్లలు ఉండగా, వారి ఆలనా పాలనపై ప్రశ్నలు ఏర్పడ్డాయి. జమ్మికుంట పట్టణంలో హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇంటి పెద్ద మృతితో కుంటుంబానికి ఆసరా లేకుండా పోయింది.

దాతలు స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

మానవతా దృక్పథంతో తమవంతుగా ఎవరైనా కొంత సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 93978 75006 నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *