వేదం న్యూస్, చిల్పూరు : చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో గౌడ సంఘం ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఎన్నికల్లో తాళ్లపల్లి పెద్దోళ్ల సమ్మయ్య 156 ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలో ప్రత్యర్థులను అధిగమించి ఆయన విజయం దక్కించుకున్నారు. ఎన్నికల్లో తాళ్లపల్లి ఎర్రోళ్ల రాజకుమార్‌కు 85 ఓట్లు, తాళ్లపల్లి నల్ల రమేష్‌కు 47 ఓట్లు, తాళ్లపల్లి బొడ్డు రమేష్‌కు 3 ఓట్లు లభించాయి. మొత్తం 291 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన పెద్దోళ్ల సమ్మయ్యకు గౌడ సంఘం సభ్యులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.