వేద న్యూస్, సినిమా:

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ ప్రేక్షకులను అత్యంతగా అలరించిన చిత్రాల్లో అది ఒకటి కాగా, ఓవర్సీస్ లోనూ మహేశ్ సత్తా చాటిన ఫిల్మ్ గా అది రికార్డుకెక్కింది. కాగా, ఈ చిత్రానికి తొలి హీరో మహేశ్ బాబు కాదన్న సంగతి మీకు తెలుసా..

సీనియర్ నటుడు మురళీ మోహన్ జయభేరి ప్రొడక్షన్స్ పై నిర్మితమైన ఈ చిత్రానికి కథానాయకుడిగా తొలుత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ను అనుకున్నారట. ఉదయ్ కిరణ్ సైతం సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని, కానీ, తర్వాత కొన్ని కారణాల వల్ల చేయలేదని పేర్కొన్నాడు మురళీ మోహన్. ఈ విషయాలన్నీ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  మహేశ్ కెరీర్ లో నే అత్యంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రం ‘అతడు’ కాగా, అది ఆయన కాకుండా వేరే ఎవరైనా చేసి ఉంటారని అనుకుంటేనే ఊహించుకోలేకపోతామని మహేశ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.