వేద న్యూస్ ,ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం గాలి పల్లి శివారులోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మరియు ఒక జెసిబి ని నమ్మదగిన సమాచారంతో ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో ట్రాక్టర్లను మరియు జెసిబి ని పట్టుకొని మట్టి తరలించుటకు ఏమైనా అనుమతి ఉందా అని అడుగగా వారు ఎటువంటి అనుమతి పత్రాలు చూపించినందున ఆ యొక్క నాలుగు ట్రాక్టర్లను మరియు జెసిబిని సీజ్ చేయనైనది. ఎవరు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు భూమిలో తవ్వకాలు మరియు మట్టి తరలింపు జరుపుటకు సంబంధిత శాఖల వద్ద అనుమతి తీసుకోవాలి లేనిచో వారిపైన చట్ట ప్రకారం వాహనాలు సీజ్ చేసి తదుపరి చర్య తీసుకొనబడుననీ ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.