జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల:

జిల్లాలో అక్రమ మట్టి మరియు ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వేములవాడ రూరల్ మండలంలోని కొడి ముంజ అనుపురం గ్రామ పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 మట్టి త్రవ్వే యంత్రాలు మరియు వాహనాలను వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధాబాయి ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ తో అక్రమంగా తరలిస్తున్న మట్టి 4 టిప్పర్లు 2 ట్రాక్టర్లు 2 జెసిబి లు 2 హిటాచి యంత్రాలను వేములవాడ ఆర్డిఓ రాధాభాయి సీజ్ చేసి వారి పై కేసులు నమోదు చేశారూ.జిల్లాలో ఎవరు అనుమతి లేకుండా అక్రమ మట్టి మరియు ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.