వేద న్యూస్, వరంగల్:
మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా మారింది. మఫ్తీలో వచ్చిన టాస్క్ ఫోర్స్ అధికారితో మంత్రి సురేఖ తనయ..‘‘మా ఇంటికి ఎందుకొచ్చారు?’’ అంటూ ప్రశ్నించారు. వారెంట్ ఉందా? ఎందుకు వచ్చారంటూ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలోనేనా? అంటూ సుస్మితా పటేల్ పోలీస్ అధికారిని అడిగారు. సదరు అధికారికి కూడా కుర్చీలు వేసి కూర్చోవాలని కోరారు. తన ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. వారెంట్ కానీ ఎవిడెన్స్ కానీ వీడియోలు కాని చూపించాలన్నారు.
సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమంత్ .. సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తున్నది.