*టీ వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావును కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత*
వేద న్యూస్, పాపన్నపేట
టీ వై జె ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ చారి కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ, టీ వై జె ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావును రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా మధుసూదన్ చారి కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీ వై జె ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్, రాష్ట్ర కార్యదర్శి జగత్ కృష్ణ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
