
వేద న్యూస్ ,వేములవాడ:
వేములవాడ పట్టణంలోనీ
తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా పనులకు బ్రేక్ ఇచ్చిన అధికారులు పనులను పున:ప్రారంభించారు.ఇందులో భాగంగా సోమవారం వేకువ జామునే తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న భవనాలు, దుకాణ సముదాయాలు, రేకుల షెడ్డులను జేసిబిల సాయంతో తొలగించారు.ఈ తొలగింపుల అనంతరం అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న మూలవాగు రెండో వంతెన పనులుప్రారంభంకానున్నాయి.అడ్డుకుంటున్న బాధితులు
ఇదిలా ఉండగా కూల్చివేతలకు వచ్చిన అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు.తమకు పూర్తి స్థాయిలో నష్ట అందకుండానే కూల్చివేతలను ప్రారంభించారని పరిహారం ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఒక బాధితుడు సమీపంలోని భారీ హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. కూల్చివేత పనులను నిలిపి వేయాలని డిమాండ్ చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు వారికి నచ్చజెప్పి పనులు సాఫీగా సాగేలా చేశారు.మరోవైపు కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో 60మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ పాపం ఊరికే పోదు అంటూ నిందించడంతో అక్కడే ఉన్న అధికారులకు ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఏదిఏమైనాప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతో కూల్చివేతలను మాత్రం ఆపేది లేదని కరాకండిగా చెబుతున్నారు.